జనవరి 26న ఢిల్లీలో జరిగే గణతంత్ర వేడుకల పరేడ్‌లో ఈసారి అయోధ్య రామమందిర శకటం ఉండనుంది. ఉత్తర్‌ప్రదేశ్ ప్రభుత్వం తరుపున ఈ శకటాన్ని ప్రదర్శించనున్నారు. అయోధ్యలో త్వరలో నిర్మించబోయే రామమందిరం ఆకృతిని ఈ శకటంపై రూపొందించనున్నారు.
ప్రతి యేడాది ఆయా ప్రభుత్వాలు తమ రాష్ట్రం తరుపున ఈ శకటాలను ప్రదర్శిస్తామని కేంద్రానికి సమాచారం ఇస్తాయి. అందులో నుండి కొన్నింటిని కేంద్రం ఎంపిక చేసి, జనవరి 26న ప్రదర్శనకు అనుమతి ఇస్తాయి. ఈసారి సర్వ ధర్మ సమాభావ్ థీమ్‌తో ఈ ఏడాది గణతంత్ర వేడుకల్లో శకటాలను ప్రదర్శించనున్నారు.