కరోనా వైరస్ చికిత్స కోసం ఆయుష్ డాక్టర్లకు ఇచ్చిన అనుమతిపై కేంద్రం అభ్యంతరం వ్యక్తం చేసింది. కరోనా రొగులకు వారు ఎటువంటి మందులు ఇవ్వొద్దని.. ఆ మందులను ప్రచారం చేయొద్దని తీర్పునిచ్చింది. ఇదే విషయంపై గతంలో కేరళ హైకోర్టు ఇచ్చిన ఆదేశాలను సుప్రీం సమర్థించింది.
కరోనా కోసం ఇమ్యూనిటీని పెంచే మందులను మాత్రమే ఆయూష్ డాక్టర్లు ఇవ్వాలంటూ ఆగస్టు 21న కేరళ హైకోర్టు తీర్పు చెప్పింది. ఆ ఆదేశాలను సవాల్ చేస్తూ డాక్టర్ ఏకేబీ సద్బావన మిషన్ స్కూల్ ఆఫ్ హోమియోఫార్మసీ సుప్రీంకోర్టులో పిల్ దాఖలు చేశారు.అయితే సుప్రీంకోర్టు కూడా ఆ తీర్పును సమర్థించింది. హోమియోపతి, ఆయుర్వేద, సిద్ధ, యునాని వంటి వైద్య విధానాలు పాటించేవారిని ఆయూష్ డాక్టర్లుగా పరిగణిస్తారు.