వైసీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి, సీఎం జగన్ కు బడిత పూజ ఖాయమని వ్యాఖ్యానించారు టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు అయ్యన్నపాత్రుడు. ఇంట్లో వాళ్ళు ఎవరిని లెక్క చెయ్యడం లేదనేది సమాజం మొత్తం చూస్తోంది వీసా రెడ్డి.. మాట్లాడే ముందు జాగ్రత్తలు తీసుకుంటే బాగుంటోందని కౌంటర్ ఇచ్చారు.
తల్లి, చెల్లి, బావ ఛీకొట్టి పక్క రాష్ట్రానికి వెళ్లిపోవడం కంటే పెద్ద ఛీత్కారం ఏముంటుంది..? అని సీఎం జగన్ కు చురకలు అంటించారు అయ్యన్న పాత్రుడు. వీసారెడ్డి రాజ్యసభ, జగన్ సీఎం పదవి.. రెండూ పోయే రోజు దగ్గర పడిందని విరుచుకుపడ్డారు.
ముందస్తు జాగ్రత్తగా కార్యకర్తల కోసం నిర్వహిస్తున్న జాబ్ మేళాలో ఉద్యోగాలు రిజర్వ్ చేసుకోమని ఎద్దేవా చేశారు. కార్యకర్తల జాబ్ మేళా కాదు.. హామీ ఇచ్చిన ప్రకారం ముందు 2.30 లక్షల ప్రభుత్వం ఉద్యోగాలు భర్తీ చేయాలని డిమాండ్ చేశారు.
ఉద్యోగాల నోటిఫికేషన్ విషయంలో జాప్యం చూపిస్తే.. అటు జగన్ కు, ఇటు నీకు నిరుద్యోగులే బడిత పూజ చేస్తారు జాగ్రత్త అని వీసారెడ్డిని ఉద్దేశించి హెచ్చరించారు. త్వరలోనే తెలుగు దేశం పార్టీ ఏపీలో అధికారంలోకి రాబోతుందని చెప్పారు అయ్యన్నపాత్రుడు.