విశాఖ: తెలుగుదేశం పార్టీ నుంచి జంపింగ్‌ల సిరీస్ కొనసాగుతోంది. ఈసారి వంతు ఉత్తరాంధ్రకు చెందిన సీనియర్ నేత అయ్యన్నపాత్రుడు కుటుంబం నుంచి. టీడీపీ ముఖ్య నేతల్లో ఒకరు, మాజీ మంత్రి చింతకాయల అయ్యన్నపాత్రుడు సోదరుడు సన్యాసి పాత్రుడు టీడీపీకి గుడ్‌బై చెప్పారు. ఇది తెలుగుదేశం పార్టీ అధినేతకు ఊహించని షాక్. తాన అనుచరులతో కలిసి తెలుగుదేశం పార్టీకి రాజీనామా చేస్తున్నట్టు సన్యాసిపాత్రుడు ప్రకటించారు. ఆయనతో పాటు కౌన్సిలర్లు, ఇతర సంఘాల నేతలు కలిపి పది మంది పార్టీకి ఒకేసారి రాజీనామా చేశారు. ఏ పార్టీలో చేరేది త్వరలో అందరితో చర్చించి ప్రకటిస్తానని సన్యాసి పాత్రుడు మీడియాకు చెప్పారు.