హరిహర సుత అయ్యప్ప స్వామి స్వామి కొలువుదీరిన శబరిమలలో ఈ సీజన్ లో 19 మంది గుండె నొప్పితో మరణించారు. నవంబర్ 15 నుంచి ఇప్పటివరకు 19 మంది మృత్యువాత పడ్డారని, అందులో 15 మంది పంబ నుంచి ఆలయానికి వెళ్తున్న సమయంలో మరణించారని ట్రావెన్ కోర్ దేవస్థానం బోర్డు అధికారులు ప్రకటించారు. మరో నలుగురు కొట్టాయంలోని ప్రభుత్వ వైద్య కళాశాలలో చికిత్స పొందుతూ మరణించారని వెల్లడించారు.
పంబ నుంచి సన్నిధానం వరకు మొత్తం 15 వైద్యకేంద్రాల్లో ౩౦,157 మంది భక్తులకు చికిత్స చేశామని, ఇందులో 414 మందికి అత్యవసర చికిత్స అందించామని తెలిపారు. మండల పూజ సందర్భంగా వచ్చిన భక్తుల రద్దీ పెరిగినందున చాలా మంది ఆనారోగ్యానికి గురయ్యారని ఆలయ అధికారులు వివరించారు.