మేడ్చల్ జిల్లా జవహార్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఏఎస్ఐ సుధాకర్ రెచ్చిపోయారు. అయ్యప్ప గుడికి వెళ్తున్నఅయ్యప్ప మాలదారుడిపై నడి రోడ్డుపై చేయి చేసుకుని వీరంగం సృష్టించారు.
బైక్ పై తన సోదరితో ప్రసాద్ అనే అయ్యప్ప స్వామి బైక్ గుడికి వెళ్తుండగా, ఆపి అసభ్య పదజాలాలు తిడుతు చెంపపై కొట్టారు. దాడి సమయంలో మొత్తం ఘటనను చిత్రీకరిస్తున్న ప్రసాద్ సోదరి ఫోన్ లాక్కొని ఏఎస్ఐ సుధాకర్ దుర్భాషలాడారు. ఏఎస్ఐ అన్యమతస్తుడని, కావాలనే దాడి చేశారని ప్రసాద్ ఆరోపించారు.
పోలీసుల దాడితో అయ్యప్ప స్వామి మాల ధరించిన వారంతా పోలీసులకు వ్యతిరేకంగా ధర్నాకు దిగారు.