బాలీవుడ్ లవ్ బర్డ్స్ సిద్దార్థ్ మల్హోత్ర, కియారా అద్వానీలు డేటింగ్‌లో ఉన్నారంటూ ఎప్పటి నుంచో వార్తలు వినిపిస్తున్నాయి. ఆ తర్వాత వీరి గురించి పలు వార్తలు వైరల్ కూడా అయ్యాయి. వారిద్దరూ లవ్ కు బ్రేకప్ చెప్పారంటూ విడిపోతున్నారంటూ గతంలో వార్తలు వచ్చాయి.
ఆ తర్వాత కాఫీ విత్ కరణ్ ప్రోగ్రాంలో కియారా సిద్దార్థ్ కొన్ని విషయాలను పంచుకున్నారు. షేర్షా సినిమాలో నటించడానికన్నా ముందే ఒకరి కొకరు తెలుసన్నారు. అప్పుడు హాయ్ మాత్రమే చెప్పుకునే వాళ్లమని, ఆ సినిమా తర్వాత స్నేహం మరింత బలపడిందన్నారు. ఇప్పుడు సిద్దూ తనకు స్నేహితుని కన్నా ఎక్కువే అని అన్నారు.
దీంతో వీరిద్దరి మధ్య డేటింగ్ వార్తలు బలపడ్డాయి. త్వరలోనే వీరిద్దరూ పెండ్లి పీటలు ఎక్కనున్నారని వార్తలు వచ్చాయి. ఈ ఏడాదిలోనే వారిద్దరూ వివాహ బంధంతో ఒకటవుతారనే వార్తలు కూడా వచ్చాయి. వీటిపై వారిద్దరు మాత్రం స్పందించలేదు.
ఇది ఇలా ఉంటే తాజాగా ఓ పార్టీలో ఈ లవ్ బర్డ్స్ ఓ బర్త్ డే పార్టీలో తళుక్కు మన్నారు. నిర్మాత అశ్వినీ యార్దీ బర్త్ డే పార్టీలో వారిద్దరూ కలిసి తిరుగుతూ కనిపించారు. వైట్ బ్యాక్ లెస్ టాప్, మెటాలిక్ గోల్డ్ స్కర్ట్ లో మెరిసి పోయారు. ఇక సిద్దార్థ్ ఫంకీ డెనీమ్ షర్ట్ విత్ క్యాజువల్ ప్యాంట్‌తో ఆకట్టుకున్నాడు. దీనికి సంబంధించిన ఫోటోలు వైరల్ అవుతున్నాయి. దీనిపై అభిమానులు, నెటిజన్లు తెగ కామెంట్స్ చేస్తున్నారు.