దిషా పటానీతో ఎవరీ కుర్రాడు ?

‘ బాఘీ.2 ‘ చిత్రంలో టైగర్ ష్రాఫ్ తో జోడీగా నటించి మంచి మార్కులే కొట్టేసింది దిషా పటానీ. ఈ సినిమాకు ముందే వీళ్ళిద్దరూ డేటింగ్ చేస్తూ.. ఆ యవ్వారం మెల్లగా రిలేషన్ షిప్ వరకూ వెళ్ళిందన్న వార్తల వేడి ఇంకా చల్లారకముందే ఈ అమ్మడు మరో కొత్త కుర్రాడితో చక్కర్లు కొడుతోంది.

ముంబై బాంద్రాలోని ఓ హోటల్ బయట వీళ్ళిద్దరూ కెమెరా కంట బడ్డారు. నూనూగు మీసాల ఈ మిస్టరీ మ్యాన్ ఎవరో తెలీదు గానీ.. జిమ్ లో ఈమె పార్ట్ నర్ అట !

అతడితో చిరునవ్వులు ఒలకబోస్తూ..దిషా..నిషా ఎక్కిస్తోందన్న మాటే ! నేచురల్ గానే సోషల్ మీడియాలో ఈ ఫోటోలు వైరల్ అవుతున్నాయి.