బాలీవుడ్ లో స్టార్ హీరో సల్మాన్ ఖాన్ మాదకద్రవ్యాలు సేవిస్తాడని యోగా గురు బాబా రాందేవ్ షాకింగ్ ప్రకటన చేశారు. ఆమిర్ ఖాన్ గురించి తనకు తెలియదని, షారుఖ్ ఖాన్ కొడుకు మాదకద్రవ్యాలు తీసుకుని పట్టుబడి జైలుకెళ్లిన విషయం మనకు తెలిసిందేనని అన్నారు. మొరాదాబాద్ లో నిన్న జరిగిన ‘ఆర్యవీర్’, ‘వీరంగనా’ కాన్ఫరెన్స్ లో మాట్లాడిన ఆయన.. బాలీవుడ్ లో చాలామంది ప్రముఖులకు, తారలకు ఈ అలవాటు ఉందని చెప్పారు.
When did Salman Khan get married? Where did you find his child, #businessman_Ramdev ji??? pic.twitter.com/QFUUUTehK7
— Muijul Hoque Talukder (@MuijulT) October 16, 2022
వారి గురించి భగవంతుడికే తెలియాలి అని వ్యాఖ్యానించారు. బాబా రాందేవ్ చేసిన ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
ఫిల్మ్ ఇండస్ట్రీలోనే కాదు.. పాలిటిక్స్ లో కూడా ఈ జాడ్యం ఉంది.. ఎన్నికల సందర్భంగా మద్యాన్ని పంపిణీ చేస్తున్నారు. డ్రగ్ ఎడిక్షన్ నుంచి ఇండియాను విముక్తం చేయాలని మనమంతా ముక్త కంఠంతో తీర్మానించుకోవాలి అని ఆయన పిలుపునిచ్చారు. అసలు దేశం నుంచే ఈ మహమ్మారిని తరిమివేయాలన్నారు.
మాదకద్రవ్యాల నుంచి సమాజాన్ని విముక్తం చేసేందుకు బాబా రాందేవ్ ప్రచారం చేస్తున్నారు. అయితే బాలీవుడ్ లో ముఖ్యంగా సల్మాన్ ఖాన్ ని, మరో ఇద్దరు ఖాన్ లను ఉద్దేశించి ఆయన ప్రత్యేకంగా చేసిన కామెంట్స్ సంచలనం సృష్టిస్తున్నాయి. ఇది పెను వివాదానికి దారి తీయవచ్చునని భావిస్తున్నారు.