ఎన్ఆర్ఐ యువకుడి అరెస్ట్ పై టీడీపీ నేత చంద్రబాబు నాయుడు మండిపడ్డారు. వెంటనే అంజన్ ను విడుదల చేయాలని బాధ్యులైన పోలీసులపై డీజీపీ చర్యలు తీసుకోవాలని బాబు డిమాండ్ చేశారు. సీఎం జగన్ కు వ్యతిరేకంగా సోషల్ మీడియాలో పోస్టులు పెడితే అరెస్ట్ చేయడం దారుణమని ఆయన ఫైర్ అయ్యారు.
ఇక పోలీసులు తీసుకెళ్ళిన అంజన్ ఆచూకీ తెలియపర్చకపోవడం అప్రజాస్వామికమని బాబు మండిపడ్డారు. వెంటనే యువకుడు అంజన్ ను విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ఇక ఇలా ఉంటే గన్నవరానికి చెందిన ఎన్ఆర్ఐ అంజన్ ను పోలీసులు ఇంటి నుంచి తీసుకెళ్లారు.
సీఎం జగన్ కు వ్యతిరేకంగా అతను సోషల్ మీడియాలో పోస్టింగులు పెడుతున్నాడని అతని ల్యాప్ టాప్ తోపాటు సెల్ ఫోన్ ను స్వాధీనం చేసుకున్నారు.మరో వైపు అతని వృద్ధ తల్లిదండ్రులు పోలీసులు తమ కొడుకును ఎక్కడికి తీసుకెళ్లారో తెలియక ఆందోళన చెందుతున్నారు. అమెరికాలో మెకానికల్ నెట్వర్క్ ఇంజినీర్ గా పనిచేసి ఇంటికి తిరిగి వచ్చిన అంజన్ కొంత కాలంగా ఖాళీగానే ఉంటున్నాడు.
అయితే సీఎం జగన్ సర్కార్ పై సోషల్ మీడియాలో అసభ్యకరమైన పోస్టులు పెడుతున్నాడని ఆరోపణలున్నాయి. దీంతో ఏకంగా పది మంది పోలీసులు అంజన్ ఇంటి పై దాడి చేసి అతడ్ని వెంట తీసుకెళ్లారు. అయితే ఎక్కడికి తీసుకెళ్లారో చెప్పాలని అంజన్ తల్లదండ్రులు డిమాండ్ చేస్తున్నారు.