టీడీపీ అధినేత చంద్రబాబు వ్యక్తిగత కార్యదర్శి మనోహర్ నాయుడు కారు డ్రైవర్ నాగరాజుపై కుప్పంలో గుర్తు తెలియని వ్యక్తులు దాడి చేయడం కలకలం రేపింది. ద్విచక్ర వాహనంపై వెళ్తుండగా స్థానిక ఆర్ అండ్ బీ గెస్ట్ హౌస్ వద్ద ఆయనపై దాడి చేశారు. నిన్న రాత్రి ఈ దాడి జరిగింది.
దాడిలో గాయపడిన నాగరాజును స్థానికులు కుప్పం ప్రభుత్వ ఏరియా ఆసుపత్రికి తరలించారు. గుర్తు తెలియని వ్యక్తులు తనపై దాడి చేశారని నాగరాజు తెలిపాడు.
ఏది ఏమైనా పోలీసు దర్యాప్తు ఏవిధంగా జరుపుతుందో నని తెలుగుదేశం శ్రేణులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నాయి
నాగరాజు పైదాడి చేయడాన్ని తెలుగుదేశం నాయకత్వం సీరియస్ గా తీసుకుంది ఈ తరహా సంఘటనలు పార్టీ పై తీవ్ర ప్రభావం చూపెడుతుందని కేవలం భయోత్పాతం కలిగించేందుకే దాడులు జరుగుతున్నాయా అని అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు