బాబూమోహన్, బీజేపీ నేత
ఎమ్మెల్యే క్రాంతి కిరణ్ చెల్లని రూపాయి. ఆయన క్రాంతి కిరణ్ కాదు.. చీకటి కిరణ్. డబ్బు సంపాదనే ముఖ్యం. దొంగ బిల్లులు పెట్టి మున్సిపల్ నిధులు దోచేశారు. మతి లేకుండా బండి సంజయ్ గురించి మాట్లాడుతున్నారు. ప్రగతి భవన్ మీద రాళ్లు వేసి కేసీఆర్ ను తిట్టిన చరిత్ర క్రాంతి కిరణ్ ది.
నియోజకవర్గంలో నేను చేసిన పనులకు రంగులు మార్చి తమ పేరు చెప్పుకుంటున్నారు. క్రాంతి కిరణ్ కు రోడ్డు తెచ్చుకునే సత్తా ఉందా..? మాపై విమర్శలు చేసే స్థాయి అతనికి లేదు. పాదయాత్రకు వస్తున్న జనస్పందన చూసి టీఆర్ఎస్ నేతలకు పిచ్చిపట్టింది. అందుకే నోటికొచ్చినట్లు మాట్లాడుతున్నారు.
దళిత బంధు అందరికీ ఇవ్వాలని మేము చెబుతున్నాం. అందులో తప్పేముంది. దీనిపై కూడా విమర్శలు చేస్తున్నారు టీఆర్ఎస్ నేతలు.