మనషి జీవితం ఏడుపుతో మొదలై.. ఏడుపుతోనే అంతం అవుతుంది. ఇది అందరికి తెలిసిన విషయమే. కానీ ఓ పాప జీవితంలో ఇందుకు విరుద్దంగా జరిగింది. ఆ పాప నవ్వుతూ పుట్టింది. జీవితాతం నవ్వుతూనే ఉంటుంది.
ఎప్పుడూ నవ్వుతూ కనిపించడం అదృష్టం అని అంతా అనుకుంటారు. కానీ ఈ పాప విషయంలో మాత్రం ఓ లోపం వల్ల ఇలా జరిగింది. దీంతో ఆ పాప తల్లిదండ్రులు బాధపడుతున్నారు.
ఐలా సమ్మర్ ముచా గతేడాది డిసెంబర్ లో ఆస్ట్రేలియాలో జన్మించారు. తల్లిదండ్రులు క్రిస్టినా వెర్చర్, బ్లైజ్ ముచా. గర్భంలో ఉన్నప్పుడే ఐలాలో ఈ రుగ్మత ఉన్నదని, అల్ట్రాసౌండ్ స్కాన్‌లో ఈ విషయాన్ని తాము గుర్తించలేకపోయామని వైద్యులు తెలిపారు.
దీని వల్ల నోరు చాలా పెద్దగా తెరుచుకుంటుంది. ఈ కారణంగా పాలు తాగడానికి, ఆహారం తినడానికి పాపకు వీలుకాదు. ఈ వైకల్యాన్ని ఈ విధమైన శారీరక వైకల్యాన్ని మాక్రోస్టోమియా అని అంటారు.
ఈ చిరునవ్వును శస్త్ర చికిత్స ద్వారా సరిచేయాలని వైద్యులను పాప తల్లిదండ్రులు సంప్రదిస్తున్నారు. ఈ వైకల్యంపై సామాజిక మాధ్యమాల్లో అందరికి అవగాహక కల్పిస్తూ తమ అనుభవాలను షేర్ చేస్తున్నారు.