ఒక గున్న ఏనుగుకు జడ్ ప్లస్ ప్లస్ ప్లస్ భద్రత ఉంది మీకు తెలుసా..? గున్న ఏనుగేంటి..? జడ్ ప్లస్ ప్లస్ ప్లస్ భద్రతేంటీ..? వినడానికే ఆశ్చర్యంగా ఉంది కదూ. అవును ఇది నిజం. అప్పుడే పుట్టిన ఏనుగు పిల్లకు జడ్ ప్లస్ ప్లస్ ప్లస్ భద్రత ఉంది. అదేంటీ కేవలం వీవీఐపీలకు, రాజకీయ నాయకులకు మాత్రమే ఉండే ఈ భద్రత ఏనుగు పిల్లకు ఉండటం ఏంటీ అని అనుమానంగా ఉందా..?
ఈ ఏనుగు పిల్లకు ప్రభుత్వాధికారులు కేటాయించిన భద్రత కాదు. తన తల్లి ఏనుగుతో పాటు కలిసి మరి కొన్ని పెద్ద ఏనుగులు ఏర్పరిచిన భద్రత. ప్రస్తుతం ఈ వీడియో ఒకటి సామాజిక మాధ్యమాల్లో వైరల్ గా మారింది.
సుశాంత నంద అనే ఐఎఫ్ ఎస్ ఆఫీసర్ ఈ వీడియోను తన ట్విటర్ ఖాతాలో షేర్ చేశారు. * ఈ భూమ్మీద ఎవరూ కూడా అంత భద్రత కల్పించలేరు. అది కేవలం ఏనుగుల గుంపుకు మాత్రమే సాధ్యమైంది. అప్పుడే పుట్టిన పిల్ల ఏనుగుకు మిగతా ఏనుగులు జడ్ ప్లస్ ప్లస్ ప్లస్ కేటగిరి భద్రత కల్పించాయని* ఆయన పేర్కొన్నారు.
ఈ దృశ్యం కోయం బత్తూర్ లోని సత్యమంగళం ఏరియాలో ఆవిష్కృతమైందని పేర్కొన్నారు.
Here is the 1st part of the clip shared by a colleague. Just see how it started & the way additional reinforcements come in at 0.12 sec to escort the kiddu. Fascinating. pic.twitter.com/VC0w3R48Et
— Susanta Nanda IFS (@susantananda3) June 23, 2022