ప్రసవ సమయంలో నిర్లక్ష్యంగా వ్యవహరించి శిశువు మరణానికి కారకులయ్యారు ప్రభుత్వాసుపత్రి వైద్యులు. ప్రసవ సమయంలో శిశువు తల, మొండెం వేరు చేశారు. తమ తప్పును ఆలస్యంగా గుర్తించి… విషయం బయటకు పొక్కకుండా పెద్దాసుపత్రికి వెళ్లాలంటూ చేతులు దులుపుకున్నారు. దాంతో బంధువులు హైదరాబాద్ పెట్లబురుజు ఆసుపత్రికి తీసుకరాగా… అసలు విషయం తెలియటంతో వారి బంధువులు అచ్చంపేట ప్రభుత్వాసుపత్రి ఎదుట ఆందోళన చేశారు. ఇందుకు కారణమైన వైద్యురాలు సుధారాణి, ఇతర అధికారులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
ఈ ఘటనపై ఆరా తీసిన కలెక్టర్ శ్రీధర్ అధికారులతో మాట్లాడగా… ఆసుపత్రి అధికారులు తారాసింగ్, డాక్టర్ సుధారణిని సస్పెండ్ చేశారు. అయితే, డెలివరీ సమయానికే కడుపులోనే శిశువు కుళ్లిపోయి ఉందని… అందుకే తల, మొండెం వేరయిందని ఆసుపత్రి వర్గాలు ఉన్నతాధికారులకు వివరణ ఇచ్చాయి.