బచ్ పన్ కా ప్యార్ పాటతో పాపులర్ అయిన బాలుడు సహదేవ్ డిర్డో రోడ్డు ప్రమాదానికి గురయ్యాడు. అతను వెళ్తున్న ద్విచక్ర వాహనం ఛత్తీస్ గఢ్ లోని సుక్మా జిల్లాలో అదుపుతప్పి కిందపడింది. దీంతో సహదేవ్ కు తీవ్ర గాయాలయ్యాయి. తొలుత సుక్మా జిల్లా ఆసుపత్రికి తరలించగా.. తర్వాత మెరుగైన చికిత్స కోసం జగ్ దల్ పూర్ వైద్య కళాశాల హాస్పిటల్ కు తీసుకెళ్లారు.
సహదేవ్ కు మెరుగైన వైద్యం అందించాలని ఛత్తీస్ గఢ్ సీఎం భూపేష్ భగేల్ అధికారులను ఆదేశించారు. 2019లో క్లాస్ రూంలో బచ్ పన్ కా ప్యార్ పాట పాడి సోషల్ మీడియాలో హల్ చల్ చేశాడు సహదేవ్. ఛత్తీస్ గఢ్ సీఎం సైతం అతడి ప్రతిభను మెచ్చుకున్నారు. తర్వాత బాలీవుడ్ రాపర్ బాద్షా బాలుడి వీడియో చూసి బచ్ పన్ పాటను మళ్లీ తీశాడు. ఆ తర్వాత సహదేవ్ బాగా పాపులర్ అయ్యాడు.