“బచ్‌పన్ కా ప్యార్” అనే సాంగ్ పాడిన ఓ అబ్బాయి వీడియో ఇటీవల కాలంలో బాగా వైరల్ అయ్యింది. ఆ సాంగ్ పాడింది సహదేవ్ డిర్డో అనే బాలుడు. “బచ్‌పన్ కా ప్యార్” సాంగ్ తో ఓవర్ నైట్ స్టార్ అయ్యాడు. సహదేవ్ డిర్డో పాడిన “బచ్‌పన్ కా ప్యార్” వెర్షన్ అందరినీ తెగ ఆకట్టుకుంది. దీంతో సహదేవ్ బాలీవుడ్ ట్యాప్ర్ బాద్షా దృష్టిని ఆకర్షించడమే కాకుండా అతని వెర్షన్ లో పాడే అద్భుతమైన ఛాన్స్ ఇచ్చాడు. ఇటీవలే విడుదలైన ఈ వీడియో సాంగ్ ట్రెండ్ అవ్వడమే కాకుండా భారీ సంఖ్యలో షేర్ అయ్యింది.
అయితే ఈ స్మాల్ సెన్సేషన్ అప్పుడే ఇంటర్నెట్ ను వదిలేలా లేడు. మరో వెబ్ సంచలనం “మనీ హీస్ట్” థీమ్ సాంగ్ పాడిన వీడియో షేర్ చేస్తూ మరోసారి అందరి దృష్టిని తనవైపుకు తిప్పుకున్నాడు.
Advertisements
ఛత్తీస్‌గఢ్ కు చెందిన సహదేవ్ తాజాగా “మనీ హీస్ట్” థీమ్ సాంగ్ “బెల్లా సియావో” పాటను పాడి తన అధికారిక ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో షేర్ చేశాడు. ఆ వీడియో పోస్ట్ చేసిన కొన్ని గంటల్లోనే వైరల్ గా మారింది. అప్పుడే ఈ వీడియోను దీనికి 508 వేల వ్యూస్ రావడం విశేషం. “బెల్లా సియావో” సాంగ్ 19 వ శతాబ్దానికి చెందిన ఇటాలియన్ రైతు నిరసన గీతం. దీనినే బ్లాక్ బస్టర్ వెబ్ సిరీస్ “మనీ హీస్ట్” థీమ్ సాంగ్‌గా ఉపయోగించుకుంది. ఇటీవల కాలంలో ఈ సాంగ్ ను శ్రోతల నుంచి మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇక సహదేవ్ ఆ సూపర్ హిట్ పాటతో మరోసారి సెన్సేషన్ క్రియేట్ చేస్తున్నాడు.