టీవీ9లో ప్రసారమైన దీపావళికి పటాసులు కాల్చేవారిని గాడిదలతో పోలుస్తూ వచ్చిన వీడియోపై తీవ్ర ఆగ్రహవేశాలు వ్యక్తమవుతున్నాయి. సోషల్ మీడియాలో టీవీ9 శైలిపై దుమ్మెత్తిపోస్తున్నారు. దీంతో భజ్‌రంగ్‌దళ్ కార్యకర్తలు టీవీ9 ఆఫీసు ముందు ధర్నాకు దిగారు. హిందువులకు వ్యతిరేకంగా ప్రచారం చేస్తూ, హిందువుల మనోభావాలను దెబ్బతీసేలా టీవీ9 ప్రసారాలు చేస్తుందని ఆరోపించారు. టీవీ9 ఆఫీసు ముందు పటాసులు కాల్చుతూ నిరసన తెలిపేందుకు ప్రయత్నించగా… పోలీసులు భజ్‌రంగ్‌దళ్ కార్యకర్తలను అరెస్ట్ చేశారు.
ప్రజలు, సోషల్‌మీడియా, హిందుత్వ సంఘాల నుండి తీవ్ర వ్యతిరేకత రావటంతో… టీవీ9 యాజమాన్యం దిగివచ్చింది. గ్రీన్ దీపావళి కోసం ఇలా చేశామని చెప్పుకునే ప్రయత్నం చేసింది.
గ్రీన్ దీపావళి పేరుతో చేతులు కాల్చుకున్న టీవీ9 యాజమాన్యం, తీరిగ్గా ఇప్పుడు దీపాలు పట్టుకొని పశ్చాత్తాపం వ్యక్తం చేస్తోంది.