ఢిల్లీ: కేంద్ర క్రీడల శాఖ 2020 పద్మపురస్కారాలకు తొలిసారిగా పూర్తిగా మహిళ పేర్లతో జాబితాను అవార్డుల కమిటీకి పంపడం విశేషం. అందులో తెలుగమ్మాయి, బ్యాడ్మింటన్ సూపర్ స్టార్ పీవీ సింధూ పేరును దేశంలో 3వ అత్యున్నత పురస్కారం పద్మభూషణ్ కోసం సిఫారసు చేయడం మరో విశేషం. ఇటీవల ప్రపంచ ఛాంపియన్‌షిప్‌లో సింధూ స్వర్ణం సాధించి చరిత్ర సృష్టించిన నేపధ్యంలో ఈ సిఫారసు చేసినట్టు జాతీయ మీడియా ద్వారా తెలిసింది.
జాతీయ 2వ అత్యున్నత పురస్కారం పద్మవిభూషణ్ కోసం బాక్సింగ్‌లో 6 సార్లు ప్రపంచ ఛాంపియన్ సాధించిన మేరీ కోమ్ పేరును ప్రతిపాదించినట్టు సమాచారం. వీరితోపాటు మరో ఆరుగురు మహిళా అథ్లెట్ల పేర్లను సిఫారసు చేశారని అంటున్నారు.