గుంటూరు: జగన్ సర్కార్ కూడా చంద్రబాబు బాటలో భూసంతర్పణ మొదలు పెట్టింది. విశాఖపట్నంలో బ్యాడ్మింటన్ అకాడమీ ఏర్పాటుకు 5 ఎకరాలు కేటాయిస్తామని బ్యాడ్మింటన్ ఛాంపియన్ పీవీ సింధుకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ హామీ ఇచ్చారు. అకాడమీ పెట్టి బ్యాడ్మింటన్ క్రీడాకారులకు శిక్షణ ఇవ్వాలని సింధుకు సీఎం సూచించారు.
బ్యాడ్మింటన్ ఛాంపియన్ పీవీ సింధు వెలగపూడి సచివాలయంలో సీఎంని కలుసుకున్నారు. బంగారు పతకం సాధించిన సింధుకు సీయం అభినందనలు తెలియజేశారు. సింధు తల్లిదండ్రులతో పాటు, మంత్రి అవంతి శ్రీనివాస్, చాముండేశ్వరినాథ్, శాప్ అధికారులు ముఖ్యమంత్రిని కలిశారు.