బద్రీనాథ్ ఆలయ ద్వారాలు ఆదివారం తెరుచుకున్నాయి. వేద మంత్రోచ్ఛరణల మధ్య శాస్త్రోక్తంగా ఆలయ ద్వారాలను ఉదయం 6.25 గంటలకు అధికారులు తెరిచారు.
ఆలయ ద్వారాలు తెరుచుకోవడంతో వేలాదిగా వచ్చిన భక్తులు పులకించిపోయారు. కరోనా నేపథ్యంలో రెండేండ్ల తర్వాత బద్రీనాథ్ యాత్ర మళ్లీ ప్రారంభం కావడంతో పెద్ద ఎత్తున భక్తులు ఆలయానికి వస్తారని అధికారులు అంచనా వేస్తున్నారు.
అంతకు ముందు కేదారీనాథ్ ఆలయ ద్వారాలను ఈ నెల 6న తెరిచారు. ఆలయంలో మొదటి పూజను ప్రధాని మోడీ పేరు మీద నిర్వహించారు. ఉత్తరాఖండ్ సీఎం పుష్కర్ సింగ్ ధామీ పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు.
ఈ సందర్బంగా ఆలయాన్ని అద్భుతంగా అలంకరించారు. బాబా కేదారీనాథ్ స్వామి వారి డోలీని మంగళవాయిద్యాల మధ్య ఆలయానికి తీసుకు వచ్చారు. మొదటి రోజున భారీ సంఖ్యలో భక్తులు స్వామిని దర్శించుకున్నారు.