ఫైజర్-బయోఎన్‌టెక్ రూపొందించిన కరోనా వైరస్ వ్యాక్సిన్‌కు మరో దేశం కూడా అనుమతి ఇచ్చింది. అత్యవసర వినియోగానికి బహ్రైన్ దేశం సమ్మతిస్తూ నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు ఆ దేశ అధికారిక మీడియా బహ్రైన్ న్యూస్ ఏజెన్సీ తెలిపింది. బహ్రెయిన్ నేషనల్ హెల్త్ రెగ్యులేటరీ అథారిటీ టీకా వినియోగానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు వెల్లడించింది. దీంతో ఫైజర్ బయోఎన్‌టెక్ వ్యాక్సిన్‌కు ఆమోదముద్ర వేసిన రెండో దేశంగా బహ్రెయిన్ నిలిచింది. గత బుధవారమే బ్రిటన్ ప్రభుత్వం ఫైజర్ టీకా అత్యవసర వినియోగానికి అంగీకారం తెలిపింది.
మరోవైపు కరోనా వ్యాక్సిన్ నిల్వ బహ్రెయిన్ దేశానికి పెద్ద సవాల్‌గా మారనుంది. ఆదేశంలో ఉష్ణోగ్రతలు అత్యధికంగా ఉంటాయి. వ్యాక్సిన్‌ను మాత్రం మైనస్ 70 డిగ్రీల వద్ద స్టోరేజ్ చేయాలి. కోటీ 60 లక్షల జనాభా ఉన్న బహ్రెయిన్‌లో ఇప్పటివరకు 87 వేల మంది కరోనా బారినపడ్డారు.