బాహుబలి సినిమా తర్వాత రాజమౌళి రేంజ్ ఎక్కడికో వెళ్లిపోయింది. ఆ సినిమా తర్వాత ప్రభాస్ రేంజ్ కూడా పెరిగింది. పాన్ ఇండియా హీరోగా వరుస సినిమాలు చేస్తున్నాడు ప్రస్తుతం. 20 ఏళ్ళ క్రితం వచ్చిన స్టూడెంట్ నెంబర్ వన్ సినిమాతో దర్శకుడిగా మారిన రాజమౌళి… అప్పటి నుంచి కూడా ఒక్కటి అంటే ఒక్క ఫ్లాప్ కూడా లేకుండా సినిమాలు చేస్తున్నాడు. ఏ సినిమా చేసినా సరే అది ఒక సంచలనంగానే ఉంది. ఇప్పుడు జూనియర్ ఎన్టీఆర్, రాజమౌళి తో కలిసి ఒక సినిమా చేస్తున్నాడు.
Also Read:చిరంజీవి వద్దన్నసినిమాతో చుక్కలు చూసిన జూనియర్ ఎన్టీఆర్…!
ఈ సినిమా ఈ నెల 25 న ప్రేక్షకుల ముందుకి వస్తుంది. పాన్ ఇండియా డైరెక్టర్ గా రాజమౌళి ఇప్పుడు దూసుకుపోతుంటే ఆయనతో సినిమాలు చేయడానికి బాలీవుడ్ హీరోలు కూడా ఎదురు చూస్తున్నారు. తెలుగు సినిమా అంటే గతంలో శివ సినిమా ముందు తర్వాత అనే వాళ్ళు. ఇప్పుడు బాహుబలి సినిమా ముందు తర్వాత అనే విధంగా మారింది. అన్ని భాషల్లో ఉన్న హీరోలు కూడా ఆ రేంజ్ లో సినిమా చేయాలని భావించే విధంగా రాజమౌళి ప్లాన్ చేసాడు.
అయితే ఈ సినిమా వెంకటేష్ నటించిన జయం మనదేరా సినిమాకు కాపీ అనే ప్రశ్నను రాజమౌళి ముందు ఒక విద్యార్థి అడిగాడు. రాజమౌళి ఒకసారి కాలేజీ ప్రోగ్రామ్ కు వెళ్తే అక్కడ పలువురు విద్యార్థులు ఆయన్ను కొన్ని ప్రశ్నలు అడిగారు. ఈ క్రమంలోనే ఒక విద్యార్థి బాహుబలి సినిమాను జయం మనదేరా లైన్ తీసుకుని అభివృద్ధి చేశారని… తనకు అనిపించింది అంటూ అడిగితే… తాను కూడా జయం మనదేరా సినిమా చూసాను అని.. కానీ బాహుబలి సినిమా మాత్రం తన ఊహల లోకంలో ఉన్న ఆలోచనల ఆధారంగా వచ్చింది అని వివరించారు. తన సినిమాలు వాస్తవికతకు సాధారణ జీవనానికి దూరంగా ఉంటాయని… లార్జర్ దెన్ లైఫ్ రేంజ్ లో తన సినిమాలు ఉండే విధంగా ప్లాన్ చేసుకుంటా అని రాజమౌళి చెప్పుకొచ్చారు. ప్రభాస్ ఖాళీ గా ఉంటె మరో సినిమా చేస్తాను అన్నారు.
Advertisements
Also Read:స్కాములకు అడ్డాగా హెచ్‌ఎండీఏ..!