సినీ ప్రేమికులు ఎంతో ఆసక్తితో ఎదురుచూసిన ట్రిబుల్ ఆర్ శుక్రవారం విడుదలై ప్రేక్షుక లోకాన్ని ఊపేస్తుంది. భారీ అంచనాలతో రిలీజ్ అయిన ఈ సినిమాను చూసేందుకు అభిమానులు, ప్రేక్షకులు పెద్ద సంఖ్యలో థియేటర్లకు చేరుకుంటున్నారు. మూవీ సూపర్ హిట్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఇక ఈ సినిమా మొదటి రోజే గత రికార్డులను బ్రేక్ చేసింది. ఈ మూవీకి ఓపెనింగ్ డే రికార్డు స్థాయి కలెక్షన్స్ వచ్చాయి.
#RRR Day 1 biz… Gross BOC…
⭐ #AP: ₹ 75 cr
⭐ #Nizam: ₹ 27.5 cr
⭐ #Karnataka: ₹ 14.5 cr
⭐ #TamilNadu: ₹ 10 cr
⭐ #Kerala: ₹ 4 cr
⭐ #NorthIndia: ₹ 25 cr#India total: ₹ 156 cr⭐ #USA: ₹ 42 cr
⭐ Non-US #Overseas: 25 cr
WORLDWIDE TOTAL: ₹ 223 cr pic.twitter.com/B7oAjPXj40— taran adarsh (@taran_adarsh) March 26, 2022
తొలిరోజు ఆర్ఆర్ఆర్ ప్రపంచవ్యాప్తంగా దాదాపుగా రూ.248 కోట్ల గ్రాస్ సాధించింది. ఫస్ట్ డే కలెక్షన్స్ లో ఇది ఆల్ టైమ్ రికార్డుగా చెబుతున్నారు. తెలుగు రాష్ట్రాల్లో రూ.127.2 కోట్లు కొల్లగొట్టింది. ఓవర్సీస్ లోనూ రూ.69.1 కోట్ల వసూళ్లు సాధించింది.
తాజా సమాచారం ప్రకారం అమెరికా ప్రీమియర్స్‌తో పాటు తొలిరోజు కలెక్షన్లు 5 మిలియన్ల మార్కును దాటేసింది. దీంతో అంతకుముందు ఉన్న బాహుబలి-2 రికార్డ్‌ను బ్రేక్ చేసినట్లు అయింది. గతంలో బాహుబలి-2 మూవీ 4.5 మిలియన్లను రాబట్టింది. తాజాగా ఈ ఫిగర్‌ను ట్రిబుల్ ఆర్ క్రాస్ చేసింది. ఇక ఏపీ, తెలంగాణలో ఒక్క రోజే రూ.70 కోట్లు రాబట్టింది. ఇప్పటి వరకు ఇదే ఆల్ టైం రికార్డ్.
Advertisements
అలాగే, తెలుగు సినిమాలకు మరో కీలక మార్కెట్‌గా భావించే కర్నాటకలో రూ.16.04 కోట్లు సాధించింది. ఇక హిందీ బెల్ట్‌లో రూ.22.6 కోట్లు, తమిళనాడులో రూ.9.20 కోట్లు, కేరళలో రూ.4.01 కోట్ల గ్రాస్ కలెక్ట్ చేసింది.