టోనీ డ్రగ్స్ కేసు నాలుగు రోజులుగా రాష్ట్రం అంతా సంచలనం సృష్టిస్తోంది. అతని వద్ద డ్రగ్స్ కొనుగోలు చేశారనే ఆరోపణలతో 9 మందిని అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించారు పోలీసులు. వారికి నాంపల్లి కోర్టు బెయిల్ మంజూరు చేసింది. వారిని కస్టడీకి ఇవ్వాలన్న పిటిషన్ ను నాంపల్లి కోర్టు కొట్టివేయడంతో.. పోలీసులు హైకోర్టును ఆశ్రయించారు. డ్రగ్స్‌కు సంబంధించిన కీలక విషయాలు తెలుసుకోవాల్సినందున వారం రోజులు కస్టడీకి ఇవ్వాలని పోలీసులు కోరారు.
డ్రగ్స్ కొనుగోలు చేశారన్న అభియోగాలు ఎదుర్కొంటున్న తమను కస్టడీలో ప్రశ్నించాల్సిన అవసరం లేదని వ్యాపారులు వాదించారు. నిన్న ఇరువైపుల వాదనలు విన్న ఉన్నత న్యాయస్థానం.. పోలీసుల పిటిషన్ ను కొట్టివేస్తూ తీర్పునిచ్చింది కోర్టు. షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది న్యాయస్థానం. డ్రగ్స్ డీలర్ టోనీని కస్టడీ దర్యాప్తులో భాగంగా ఓ వైపు లా అండ్ ఆర్డర్.. మరోవైపు టాస్క్ ఫోర్స్ పోలీసులు సుదీర్ఘంగా విచారిస్తున్నారు.
టోనీ పేరుతో బ్యాంకు ఖాతా లేకుండా సహచరుల ఖాతాలతో వ్యవహారాన్ని నడిపినట్లు పోలీసులు గుర్తించారు. డ్రగ్స్ సరఫరా చేసేటప్పుడు వాట్సాప్ సందేశాలు, వాట్సాప్ కాల్స్ మాత్రమే వాడేవాడని విచారణలో తేలినట్టు పోలీసులు తెలిపారు. అతని సహచరుల ద్వారా అతను చేసిన లావాదేవీల వివరాలతో టోనీని ప్రశ్నించారు. విచారణలో టోనీ నుంచి మాత్రం పోలీసులకు పూర్తి సహకారం ఆడటం లేదని అంటున్నారు. టోనీకి విదేయుడైన నైజీరియాకు చెందిన వ్యక్తి నుండి అధికారులకు సమాచారం ఉండటంతో.. పోలీసులు సాంకేతిక ఆధారాలు ముందు ఉంచి ప్రశ్నిస్తున్నాట్టు పోలీసులు తెలిపారు.
మహారాష్ట్రలో కూడా ఇతను డ్రగ్స్ సరఫరా చేస్తున్నప్పటికీ.. ఇతని పేరు బయటకు రావకపోవడంతో ఇప్పటివరకు ఒక్క కేసు కూడా నమోదు కాలేదని పోలీసులు చెప్తున్నారు. కేవలం సాంకేతికత ఆధారాలతో హైదరాబాద్ పోలీసులు పక్కాగా వెళ్లి టోనీని వలపన్ని పట్టుకున్నట్టు ఉన్నతాధికారులు తెలిపారు. టోనీ అరెస్ట్ అవ్వడానికి వారం రోజుల క్రితం హైదరాబాద్ లో అతని ఏజెంట్లు అరెస్ట్ అయ్యారు. అప్పుడే టోనీ పోలీసులు తన కోసం వస్తారని గ్రహించి తన వాట్సాప్ చాట్ ను డిలీట్ చేశాడని పోలీసులు తెలిపారు.