హాఫీజ్ పేట భూ వివాదంలో అరెస్ట్ అయిన మాజీ మంత్రి భూమా అఖిలప్రియ దాఖలు చేసిన బెయిల్ పిటిషన్ పై రెండో రోజు విచారణ జరిగింది. తన ఆరోగ్య పరిస్థితులను దృష్టిలో ఉంచుకొని బెయిల్ ఇవ్వాలని, తనను కావాలనే కేసులో ఇరికించారని అఖిలప్రియ తరుపు లాయర్లు వాదించారు.
అయితే, బెయిల్ ఇవ్వొద్దంటూ పోలీసులు కోరారు. తనకు బెయిల్ ఇస్తే సాక్ష్యాధారాలను మార్చే అవకాశం ఉందని… పైగా తన భర్తతో పాటు పలువురు ఇంకా పరారీలోనే ఉన్నట్లు పోలీసులు కోర్టుకు తెలిపారు. ఆమెపై గతంలో అనేక ఆరోపణలున్నాయని, ఇప్పుడు బెయిల్ వస్తే విచారణ నుండి తప్పించుకునే అవకాశం ఉందని పోలీసులు కౌంటర్ లో పేర్కొన్నారు. పైగా ఈ కిడ్నాప్ చర్యల వల్ల స్థానికుల్లో అభద్రతాభావం ఉందని పోలీసులు కోర్టుకు తెలిపారు.