మావోయిస్టులతో సంబంధాలు ఉన్నాయనే ఆరోపణల కేసులో అరెస్ట్ అయిన ప్రొఫెసర్ కాశీం కు రంగారెడ్డి కోర్టు బెయిల్ మంజూరు చేసింది. లక్ష రూపాయల రెండు షూరిటీలతో పాటు పోలీసుల దర్యాప్తునకు పూర్తిగా సహకరించాలని కోర్టు ఆదేశిస్తూ షరతులతో కూడిన బెయిల్ ఇచ్చింది. గత నాలుగు నెలలుగా చర్లపల్లి జైలులో ఉంటున్నారు కాశీం నేడు బెయిల్ పై విడుదల కానున్నారు.