ఫుల్ ఫీచర్స్‌తో మార్కెట్‌లోకి బజాజ్ ఈ-చేతక్‌ - Tolivelugu

ఫుల్ ఫీచర్స్‌తో మార్కెట్‌లోకి బజాజ్ ఈ-చేతక్‌

బజాజ్ చేతక్ అంటే ఒకప్పుడు ఫుల్ ఫేమస్. కానీ బైక్‌లు వచ్చే కొద్ది చేతక్ కనుమరుగైపోయింది. కానీ మళ్లీ బజాజ్ చేతక్‌ను చూడబోతున్నాం. పైగా ఈసారి ఎలక్ట్రిక్ వర్షన్‌లో రాబోతుంది. లక్ష రూపాయల ధరతో ఎలక్ట్రిక్ చేతక్‌ను రిలీజ్ చేసింది బజాజ్ కంపెనీ.

డిస్క్ బ్రేక్‌లు కూడా ఉండే చేతక్‌ ఆకట్టుకునే డిజైన్ చేశారు. కీ అవసరం లేకుండానే దీన్ని ఆపరేట్ చేసే వెసులుబాటు ఉంది. పూర్తిగా మెటల్ బాడీతో ఉన్న ఈ స్కూటర్‌ 3కిలో వాట్ల బ్యాటరీ ఏర్పాటు చేశారు. ఐపీ 67వాటర్ రెసిస్టెన్స్‌ ఫీచర్ కూడా అందిస్తుండటంతో వర్షాకాలంలోనూ ఎలాంటి ఇబ్బంది లేకుండా ఈ స్కూటర్‌పై ప్రయాణించవచ్చు.

ఒక్కసారి ఫుల్ చార్జింగ్ చేస్తే ఎకో మోడ్ స్కూటర్‌లో 95కిలో మీటర్లు, స్పోర్ట్స్‌ మోడ్‌లో 85కిలో మీటర్లు ప్రయాణం చేయవచ్చు. బజాజ్ రిలీజ్ చేసిన స్కూటర్‌లో బ్యాటరీ లైఫ్‌ టైం పెంచేశారు. దాదాపు 70వేల కిలోమీటర్లు ఈ బ్యాటరీ పనిచేస్తుంది. ఇక ఫుల్ చార్జ్ అయ్యేందుకు కనీసం 5గంటల సమయం పట్టనుండగా… మొదటి గంటలోనే 25శాతం రీచార్జ్ అవుతుంది.

ఇక కార్ల తరహాలోనే ఈ ఈ-చేతక్‌కు రివర్స్‌ గేర్‌ కూడా ఉండబోతుంది. అంతేకాదు స్మార్ట్ చేతక్‌గా వచ్చిన ఈ స్కూటర్‌ యాప్‌ ద్వారా స్మార్ట్‌ఫోన్‌కు కనెక్ట్ చేసుకోవచ్చు. ఆ యాప్ ద్వారా ఎంత చార్జీ అయ్యింది, ఫుల్ చార్జ్‌కు ఎంత సమయం పడుతుంది, స్కూటర్ లోకేషన్ ఎక్కడుంది, స్కూటర్‌లో లోపాలున్నాయా అన్న అన్ని విషయాలనే చిటికెలో తెలుసుకోవటం విశేషం. ఈ స్కూటర్‌తో పాటు చార్జర్‌ను ఉచితంగా ఇస్తోంది బజాజ్.

బజాజ్ ఎలక్ట్రిక్ చేతక్‌ను ఆన్‌లైన్‌లోనూ బుక్ చేసుకునే సదుపాయం కల్పిస్తుండగా… స్కూటర్‌పై 3 సంవత్సరాల వారంటీ ఉంటుంది. 50వేల కిలోమీటర్ల వరకు వారంటీ వర్తిస్తుంది. ఇక ప్రతి 12వేల కిలో మీటర్లకు ఒకసారి లేదా ఏడాదికోసారి సర్వీసింగ్ చేయించాల్సి ఉంటుంది. మొదట కంపెనీ 3 ఉచిత సర్వీసులు ఫ్రీగా ఇస్తుంది.

Share on facebook
Share on twitter
Share on whatsapp