ప్రేమికుల దినోత్సవానికి తాము వ్యతిరేకం కాదని భజరంగ్ దళ్ కన్వీనర్ శివరాములు పేర్కొన్నారు. అలాగని ఆ పేరుతో ఈవెంట్స్ చేస్తే అంగీకరించబోమని హెచ్చరించారు. భజరంగ్ దళ్ ఎవరికీ బలవంతంగా వివాహాలు చేయదని తెలిపారు.
ప్రేమికుల దినోత్సవం సందర్బంగా కొందరు భజరంగ్ దళ్ పేరిట పెళ్లిళ్లు చేస్తున్నారని తెలిపారు. వాటితో తమకు ఎలాంటి సంబంధం లేదని స్పష్టం చేశారు. ప్రేమ పేరుతో బహిరంగ ప్రదేశాల్లో విచ్చలవిడిగా వ్యవహరిస్తే ఊరుకోబోమని భజరంగ్ దళ్ హెచ్చరిస్తోందని అన్నారు.
కోటి చౌరస్తాలో సోమవారం అమరవీరుల దినోత్సవాన్ని భజరంగ్ దళ్ కార్యకర్తలు ఘనంగా నిర్వహించారు. ప్రేమికుల దినోత్సవం సందర్భంగా హైదరాబాద్ లోని అన్ని ప్రధాన పార్కులను పోలీసులు మూసివేశారు.
ఇందిరాపార్కును పూర్తిగా పోలీసులు తమ ఆదీనంలోకి తీసుకున్నారు. పార్కుల వద్ద ప్రత్యేక బందోబస్తును ఏర్పాటు చేశారు. దీంతో ప్రధాన పార్కులన్నీ వెలవెలబోతున్నాయి.