పుల్వామా ఉగ్రదాడిలో అమరులైన జవాన్లకు అబిడ్స్ జీపీవో చౌరస్తాలో భజరంగ్ దళ్, వీహెచ్ పీ నాయకులు నివాళులు అర్పించారు. వ్యాలంటైన్స్ డేను బహిష్కరించి అమర జవాన్లను స్మరించుకోవాలని పిలుపునిచ్చారు నాయకులు.
ఈ సందర్భంగా శివరాం భజరంగ్ దళ్ రాష్ట్ర కన్వీనర్ మాట్లాడుతూ.. భజరంగ్ దళ్ ప్రేమకు వ్యతిరేకం కాదని.. ప్రేమ పేరుతో చేసే అసాంఘిక కార్యకలాపాలకు వ్యతిరేకమన్నారు.
యువతి, యువకులు ప్రేమ కోసం ప్రాణాలు తీసుకోకుండా.. అమరుల త్యాగాలను స్ఫూర్తిగా తీసుకోవాలని తెలిపారు.
కార్పొరేట్ కంపెనీలు తమ వ్యాపారం కోసం వ్యాలంటైన్స్ డే అనే పాశ్యాత్య సంస్కృతిని దేశంలో వ్యాప్తి చేశాయని మండిపడ్డారు. వ్యాలంటైన్స్ డే పేరుతో ఏ కార్యక్రమం చేపట్టినా అడ్డుకుంటామని హెచ్చరించారు.