తెలంగాణ సీఎం కేసీఆర్, ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్, పంజాబ్ సీఎం భగవంత్ సింగ్ మాన్ లకు బహుమతులు పంపినట్టు కాంగ్రెస్ నేత బక్క జడ్సన్ తెలిపారు. ప్రితి గల్లీలో మద్యం దుకాణాలు తెరిచి దేశంలో అత్యధికంగా మద్యం అమ్మినందుకు వారికి బహుమతులను కొరియర్ ద్వారా పంపామన్నారు.
పంజాబ్‌లో ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో అక్టోబర్ 12 వరకు ఎక్సైజ్ రాబడి గతేడాది ఇదే సమయంలో రూ. 3,110 కోట్లతో పోలిస్తే 37.62 శాతం వృద్ధిని నమోదు ఆ రాష్ట్ర ఆర్థిక మంత్రి ప్రకటించారని ఆయన అన్నారు.
తెలంగాణలో సోమేష్ కుమార్ ఎక్సైజ్ కమిషనర్ అయ్యాడన్నారు. మద్యం అమ్మకాల ద్వారా వచ్చే ఆదాయాన్ని 300 పెంచాడన్నారు. 2014లో ఎక్సైజ్ ఆదాయం రూ.10,000 కోట్ల ఉండగా దాన్ని 2020 నాటికి రూ.30,000 కోట్లకు పెంచాడన్నారు. ప్రస్తుతం తెలంగాణ ప్రభుత్వం రూ. 34,000 కోట్ల మద్యం అమ్మి దేశంలోనే అత్యధిక ఆదాయం పొందిందన్నారు.
ఢిల్లీ ప్రభుత్వ కొత్త ఎక్సైజ్ పాలసీ ప్రకారం అనుమతించబడిన బార్లు 849, మద్యం దుకాణాలు 552 తెరిచారన్నారు. నగరాన్ని ప్రభుత్వం 32 జోన్‌లుగా విభజించిందన్నారు. కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు కేవలం 250 ప్రభుత్వ మద్యం దుకాణాలు మాత్రమే ఉండే వన్నారు. అందువల్ల అన్నా హజారే శిష్యులైన సీఎం కేసీఆర్ మొదటి బహుమతి, కేజ్రీవాల్ కు రెండవ బహుమతి, భగవంత్ మాన్ కు మూడవ బహుమతిని కొరియర్ ద్వారా పంపినట్టు ఆయన వెల్లడించారు.