వాడు వీడు, శివపుత్రుడు వంటి చిత్రాలతో మంచి సక్సెస్ ను అందుకున్న దర్శకుడు బాలా. విశాల్, ఆర్య, సూర్య, విక్రమ్ వంటి స్టార్ యాక్టర్ తో సినిమాలు తీసి సూపర్ హిట్ లను అందించిన బాల మరో క్రేజీ ప్రాజెక్ట్ కి ప్లాన్ చేస్తున్నారు. ఈ సారి ముగ్గురు హీరోల ను పెట్టి సినిమా చేయడానికి సిద్ధమవుతున్నాడు.
ఈ సినిమాలో తమిళ నటులు సూర్య, అథర్వ, ఆర్య నటిస్తే బాగుంటుందని బాలా అనుకుంటున్నారట. ఈ ముగ్గురు హీరోల చిత్రాలకు గతంలో బాలా దర్శకత్వం వహించడం విశేషం. తన కొత్త చిత్రం కోసం వీరితో సంప్రదింపులు జరుపుతున్నారట. విక్రమ్ తనయుడు ధ్రువ్ విక్రమ్ కథానాయకుడిగా తెలుగు అర్జున్‌రెడ్డికి తమిళ రీమేక్ కు బాలా దర్శకత్వం వహించారు. ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద అంతగా ఆయకట్టుకోలేక పోయింది.