దిల్‌రాజు ప్రొడక్షన్స్ బ్యానర్ పై హర్షిత్ రెడ్డి, హన్షిత నిర్మిస్తోన్న సినిమా ‘బలగం’. ప్రియదర్శి, కావ్యా కళ్యాణ్ రామ్, సుధాకర్ రెడ్డి, మురళీధర్ గౌడ్ తదితరులు ప్రధాన పాత్రలు పోషించారు. కమెడియన్ వేణు ఈ సినిమాతో దర్శకుడిగా పరిచయమౌతున్నాడు. తాజాగా ఈ సినిమా సెన్సార్ కార్యక్రమాలను పూర్తి చేసుకుని ‘యు’ సర్టిఫికేట్ పొందింది.
దీంతో రిలీజ్ కు లైన్ క్లియర్ అయ్యింది. మార్చి 3న దిల్ రాజు, తన బలగాన్ని థియేటర్లలో ప్రేక్షకులకు పరిచయం చేయబోతున్నాడు. కొత్త కాన్సెప్ట్ సినిమాలను చేస్తూ కొత్త టాలెంట్‌ను ఎంకరేజ్ చేసే ఉద్దేశంతో హర్షిత్, హన్షిత కలిసి దిల్ రాజు ప్రొడక్షన్స్‌ను స్టార్ట్ చేశారు. అందులో భాగంగా వేణుతో బలగం సినిమాను చేశారు. తెలంగాణ పల్లెటూరి నేపథ్యంలో సాగే సినిమా ఇది. ప్రియదర్శి, కావ్యా కళ్యాణ్ రామ్‌లు సహా ప్రతి ఒక పాత్ర ప్రేక్షకుల్ని హాంట్ చేస్తుందని చెబుతోంది యూనిట్.
భీమ్స్ సంగీతంలో కాసర్ల శ్యామ్ రాసిన పాటలు ఇప్పటికే క్లిక్ అయ్యాయి. మంచి ఎంటర్‌టైన్మెంట్‌తో పాటు ఎమోషన్స్ కూడా ఉన్నాయంటున్నారు యూనిట్ సభ్యులు. ఇప్పటికే విడుదలైన ఊరు పల్లెటూరు సాంగ్ పొట్టి పిల్ల సాంగ్‌లకు సూపర్బ్ రెస్పాన్స్ వస్తున్నాయి.
పాత్రలకు తగ్గట్టు ఈ సినిమా కోసం చాలామంది నూతన నటీనటుల్ని తీసుకున్నారు. వాళ్లు కొత్తవాళ్లే అయినప్పటికీ, సినిమా చూసిన తర్వాత మనసులో నాటుకుపోతారని అంటున్నారు దిల్ రాజు.