తెలంగాణా యాస భాషలతో, మట్టివాసనతో, తెలంగాణా గుండె చప్పుడుతో తెరకెక్కిచిన చిత్రం బలగం. ఆర్థిక సంబంధాలు మానవ సంబంధాలను ప్రభావితం చేస్తున్న తరుణంలో నేటి తరంలో మానవత్వాన్ని మేలుకొలిపే జీవన వేదంగా పురుడు పోసుకున్న చిత్రం బలగం.
ఎవరిలో ఎంత విషయం ఉందో ఎవరికి తెలుసు.!? కామెడీ వేషాలు వేసుకునే వేణులో ఇంత బలగం ఉందని ఎవరికి తెలుసు.!? అతని గుండె ఇంత బాధ్యతతో నిండిందని ఎవరికి తెలుసు. తెలంగాణా కుటుంబ సంబంధాలనీ అనుబంధాలని కళ్ళకు కట్టాడు.
ప్రాంతాన్నిబట్టి భాష మారొచ్చు, యాస మారొచ్చు, రుచులు, అభిరుచులు మారొచ్చు. కానీ మనిషి మౌళిక లక్షణాలు, పరిస్థితులకు స్పందించే తీరూ మారుదు కదా.!? అందుకే బలగం ఓ మనిషి కథ. మానవత్వాన్ని ప్రబోధించే కథ.
ప్రియదర్శి, కావ్య కళ్యాణ్ రామ్ జంటగా తెరకెక్కిన ఈ చిత్రాన్ని దిల్ రాజు కుమార్తె హర్షిత రెడ్డి నిర్మించింది. ఇక చిన్న సినిమాగా రిలీజ్ అయిన ఈ సినిమాలో పెద్దవిషయం ఉండడంతో భారీ విజయాన్ని అందుకుంది.
పల్లెటూరు కథ, ప్రతి ఒక్కరు ఈ కథకు కనెక్ట్ అవుతారు. దీంతో సినిమాకు కలక్షన్స్ తో పాటు అవార్డులు, రివార్డులు రావడం కూడా జరిగాయి.. ఈమధ్యనే నంది అవార్డును కూడా సొంతం చేసుకుంది.
ఇక ఈ సినిమా ప్రస్తుతం ఇంటర్నేషనల్ స్థాయిలో గుర్తింపు తెచ్చుకుంది. లాస్ ఏంజిల్స్ సినిమాటోగ్రఫీ అవార్డుల్లో బెస్ట్ ఫీచర్ ఫిల్మ్ అవార్డును బలగం సొంతం చేసుకుంది. ఈ విషయాన్ని మేకర్స్ అధికారికంగా తెలుపుతూ.. అవార్డుల ఫోటోలను షేర్ చేశారు.
Naa BALAGAM ki
3rd award..
Balagam shines on the global stage! 🤩❤️Congratulations to our director @dopvenu @priyadarshi_i @kavyakalyanram #Bheemsceciroleo @LyricsShyam@DilRajuProdctns @HR_3555 #HanshithaReddy @adityamusic @vamsikaka @WallsAndTrends pic.twitter.com/0tmjN606EQ
— Venu Yeldandi #Balagam (@VenuYeldandi9) March 30, 2023