నందమూరి బాలకృష్ణ బోయపాటి శ్రీను దర్శకత్వంలో వచ్చిన అఖండ సినిమాతో మంచి హిట్ అందుకున్నాడు. అదే జోష్ తో ప్రస్తుతం గోపి చంద్ మలినేని తో ఓ సినిమా చేస్తున్నాడు. ఇందులో శృతి హసన్ హీరోయిన్ గా నటిస్తుండగా తమన్ సంగీతం అందిస్తున్నారు.
ఇదిలా ఉండగా ఈ సినిమాకు సంబంధించి ఓ డైలాగ్ సోషల్ మీడియా లో వైరల్ అవుతుంది. అది కూడా స్వయంగా గోపీచంద్ లీక్ చేశారు. బాలయ్య షో లో గోపి చంద్ ఈ డైలాగ్ చెప్పాడు.
రోడ్డు మీదకు జింక, గొర్రె వస్తే ఎవడైనా హార్న్ కొడతాడు… అదే సింహం వస్తే హార్న్ కాదు కదా… ఇంజిన్ కూడా ఆఫ్ చేసి సైలెంట్ గా ఉంటాడు.. అక్కడ ఉంది సింహం అంటూ చెప్పుకొచ్చాడు. ఈ డైలాగ్ ప్రస్తుతం వైరల్ అవుతుంది.