బోయపాటి శ్రీను దర్శకత్వంలో నందమూరి బాలకృష్ణ హీరోగా తెరకెక్కుతున్న చిత్రం అఖండ. భారీ అంచనాల మధ్య తెరకెక్కుతున్న ఈ సినిమాలో బాలయ్య ద్విపాత్రాభినయం చేస్తున్నాడు. ఇక ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించి విడుదలైన లుక్స్, టీజర్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. ఇక ప్రస్తుతం ఫైనల్ షెడ్యూల్ గోవా లో షూట్ చేస్తున్నారు. ఇక ఈ షెడ్యూల్ కు సంబంధించిన అప్డేట్ ఒకటి బయటకు వచ్చింది.
గోవాలో ఓ సాంగ్ ని చాలా గ్రాండ్ గా మేకర్స్ ప్లాన్ చేస్తున్నారట. అంతే కాకుండా మరో సాంగ్ ని కూడా మాసివ్ లెవెల్లో ఈ నెలాఖరున ప్లాన్ చేస్తున్నట్టు తెలుస్తుంది. దీనితో షూటింగ్ కంప్లీట్ కనుందట. ఇక ఈ సినిమాకు థమన్ సంగీతం అందిస్తుండగా… ప్రగ్యా జైస్వాల్, పూర్ణ హీరోయిన్స్ గా నటిస్తున్నారు.