తెలుగు సినిమా అగ్ర కథనాయకులంతా ఇప్పుడు పాపులారిటీతో పాటు అభిమానులకు దగ్గరగా ఉండేందుకు ప్రయత్నిస్తున్నారు. కాస్త లేటయినప్పటికీ మనవాళ్లు కూడా ట్రెండ్ ను ఫాలో అవుతున్నారు. ట్రెండ్ సెట్ చేయటం కాదు కానీ ఫాలో అవుదాం అనుకున్నట్లుగా చిరు ఇప్పటికే ట్విట్టర్ కు ఎంట్రీ ఇచ్చేశాడు. దీంతో అగ్రహీరోలంతా దాదాపు సోషల్ మీడియాలోకి ఎంట్రీ ఇచ్చినట్లయింది.
కానీ హీరో ప్రభాస్, బాలయ్యలు మాత్రం ఇంకా ఎంట్రీ ఇవ్వలేదు. ప్రభాస్ కు ఫ్యాన్స్ ఫాలోయింగ్ ఎలా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. మరోవైపు బాలయ్యకు కూడా ఓ ప్రత్యేకమైన ఫాలోయింగ్ ఉంది. దీంతో… ఇతర హీరోలంతా ఇప్పుడు ట్విట్టర్ లో తమ అభిమానులతో ముచ్చటించటం, సరదాగా తమ విశేషాలను చెబుతుంటే, తమ హీరోలు ఇంకెప్పుడు అని ఫ్యాన్స్ హైరానా పడుతున్నారట.
అంతేకాదు…. ఒకప్పటితో పోలిస్తే ఇప్పుడు సోషల్ మీడియానే సినిమాలకు హైప్ ఇవ్వటంలో కీలక పాత్ర పోషిస్తుంది. అందుకే సినిమా విశేషాలను ఒకటి, రెండు రోజులు ముందుగానే ఫలానా టైంలో, ఫలానా డేట్ లో వచ్చేస్తున్నాం అంటూ ప్రకటనలు ఇచ్చేస్తున్నారు. దీంతో… మా హీరోల వంతు ఎప్పుడొస్తుందా అని ప్రభాస్, బాలయ్య అభిమానులు ఎదురుచూస్తున్నారట.
ప్రభాస్, బాలయ్యలకు టైం ఎప్పుడొస్తుందో…?