నందమూరి హీరో బాలయ్య, డైరెక్టర్ బోయపాటి కాంబినేషన్‌లో వస్తున్న హ్యాట్రిక్ మూవీ ఆఖండ. కరోనా కంటే ముందు అనౌన్స్ చేసిన ఈ సినిమా షూటింగ్ ఇంకా కొనసాగుతూనే ఉంది. అభిమానులు ఈ మూవీ ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని వేయి కళ్లతో ఎదురుచూస్తున్నారు. అదిగో, ఇదిగో అనడమే తప్ప మేకర్స్ స్పష్టమైన సమయాన్ని చెప్పలేకపోతున్నారు.
ఆఖండ మూవీని సెప్టెంబర్‌లో రిలీజ్ చేయబోతున్నారని మొన్నటిదాకా ప్రచారం జరిగింది. అయితే తాజాగా ఈ మూవీ విడుదలను అక్టోబర్‌కు మార్చినట్టుగా తెలుస్తోంది. టాలీవుడ్ వర్గాల సమాచారం ప్రకారం.. ఆఖండ అక్టోబర్ 8న విడుదల చేయబోతున్నట్టు తెలుస్తోది. అయితే ఈ డేట్ ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ఎందుకంటే అదే నెల 13న త్రిబుల్ ఆర్ సినిమా విడుదల కూడా ఉంది. దీంతో నిర్మాతలు అంత రిస్క్ చేస్తారా అన్న అనుమానాలు కలుగుతున్నాయి. అయితే ఆర్ఆర్ఆర్ వాయిదా పడే అవకాశాలు ఉన్నాయని… అందుకే ఆఖండని అక్టోబర్ 8కి ఫిక్స్ చేశారన్న టాక్ నడుస్తోంది.