యాక్షన్ డైరెక్టర్ బోయపాటి శ్రీను దర్శకత్వంలో నందమూరి బాలకృష్ణ హీరోగా తెరకెక్కుతున్న చిత్రం అఖండ. భారీ అంచనాల మధ్య తెరకెక్కుతున్న ఈ సినిమాలో బాలయ్య ద్విపాత్రాభినయం చేస్తున్నాడు. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించి విడుదలైన టీజర్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంది. అయితే ఈ సినిమాకు సంబంధించి అభిమానులు రిలీజ్ కోసం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
కాగా తాజా సమాచారం ప్రకారం… అఖండ సినిమా లేటెస్ట్ షూట్ గోవాలో స్టార్ట్ కానుందట. వచ్చే 13 రోజుల పాటు ఈ షూట్ కొనసాగనున్నట్లు తెలుస్తోంది. దీంతో షూటింగ్ కంప్లీట్ కాబోతుందట. అలాగే ఈ సినిమా కోసం అభిమానులు ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నారు. ప్రగ్యా జైస్వాల్, పూర్ణ హీరోయిన్స్ గా నటిస్తున్న ఈ చిత్రానికి తమన్ సంగీతం అందిస్తున్నారు.