బాలకృష్ణ కథానాయకుడిగా, బోయపాటి దర్శకత్వంలో మరో సినిమా వస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఆ సినిమాకు ఐకాన్ అనే టైటిల్ ను పెట్టాలని బోయపాటి ఆలోచిస్తున్నాడట. ఇప్పటికే ఈ ఇద్దరి కాంబినేషన్లో సింహ, లెజెండ్ సినిమాలు మంచి విజయాలు సాధించటంతో ఇప్పుడు ఈ సినిమాపై మరింత అంచనాలు పెరిగాయి.
అయితే ఈ సినిమాని మొదట్లో సమ్మర్ లో రిలీజ్ చెయ్యాలని అనుకున్నారు. కానీ బాలయ్య బర్త్ డే రోజు సినిమా రిలీజ్ చేస్తే ఇంకా బాగుటుందని భావిస్తున్నాడట బోయపాటి. ఇప్పటివరకు బాలకృష్ణ పుట్టిన రోజుకు ముందు వెనుక సినిమాలు రిలీజ్ అయ్యాయి కానీ, పుట్టిన రోజునాడు ఏ సినిమా కూడా రిలీజ్ కాలేదు.
ప్రస్తుతం బాలకృష్ణ కేఎస్ రవికుమార్ దర్శకత్వంలో సి కళ్యాణ్ నిర్మాణంలో రూలర్ మూవీ తో డిసెంబర్ 20 న ప్రేక్షకుల ముందుకు వస్తున్న సంగతి తెలిసిందే.