రూలర్ సినిమా ఎఫెక్ట్ బాలయ్యకు గట్టిగానే తగిలింది. అనుకున్నట్లుగానే బోయపాటి, బాలయ్య సినిమాకు రూలర్ పుణ్యమా అని బ్రేక్ పడింది. రూలర్ సినిమాకు భారీ నష్టాలు రావటంతో నిర్మాత రవీందర్ రెడ్డి కాస్త వెనుకడుగు వేస్తున్నారట. సినిమా బడ్జెట్ ను తగ్గించమని బోయపాటి చుట్టూ తిరుగుతున్నాడట. ఈ సినిమాకిగాను బోయపాటి 15 కోట్లు, బాలయ్య 10 కోట్ల రెమ్యూనరేషన్ తీసుకుంటున్నారన్న వార్త తెలిసిందే.
ఇంత బడ్జెట్ పెట్టలేనని, బోయపాటి, బాలయ్య పారితోషకం కాకుండా ఈ సినిమాలో భాగస్వామ్యులను చెయ్యాలని నిర్మాత రవీందర్ రెడ్డి భావిస్తున్నాడట. అలా అయితే సినిమాకు నష్టాలు వచ్చిన తట్టుకోగలమని, బడ్జెట్ కూడా తగ్గుతుందని నిర్మాత రవీందర్ రెడ్డి అనుకుంటున్నట్లు చర్చ సాగుతోంది. ఈ విషయంలో బాలయ్య, బోయపాటి ఒప్పుకుంటారా లేక ఇంకో నిర్మాతను చేసుకుంటారా అనేది తెలియాలంటే కొద్ది రోజులు ఆగాల్సిందే.