నందమూరి బాలకృష్ణ హీరోగా బోయపాటి శ్రీను కాంబినేషన్ లో ముచ్చటగా మూడవ సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే ఈ ఇద్దరి కాంబినేషన్లో వచ్చిన సింహ, లెజెండ్ వంటి చిత్రాలు బాక్సాఫీస్ వద్ద ఘన విజయం సాధించాయి. దీంతో ఈ మూడవ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇప్పటికే రెండు షెడ్యూల్ లను పూర్తి చేసుకున్న ఈ చిత్రం కరోనా కారణంగా వాయిదా పడింది.
ఇక ఇటీవల షూటింగ్ పర్మిషన్ లు రావడంతో షూటింగ్ ప్రారంభమైంది. అయితే ఈ చిత్రాన్ని వచ్చే ఏడాది సమ్మర్ కానుకగా రిలీజ్ చేయాలని చిత్ర యూనిట్ భావిస్తోందట. 2021 జనవరి నాటికి థియేటర్లు పూర్తిస్థాయిలో తెరుచుకుంటాయని అందుకే ఈ చిత్రాన్ని భారీ ఎత్తున రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నాడట. ఇక ఇప్పటికే సినిమా టైటిల్ విషయంలో రకరకాల వార్తలు రాగా మోనర్క్ టైటిల్ ఫిక్స్ చేశారని తెలుస్తోంది. ఈ సినిమాకు థమన్ సంగీతం అందిస్తుండగా మిర్యాల రవీందర్ రెడ్డి నిర్మిస్తున్నారు.