టాలీవుడ్ ప్రముఖ సింగర్ సింహ పుట్టిన రోజు వేడుకలల్లో పాల్గొని స్వయంగా సెలబ్రేట్ చేశారు నందమూరి బాలకృష్ణ. అంతే కాదు ఈ ఇద్దరు కూడా త్వరలో ఓ గిఫ్ట్ ఇవ్వబోతున్నారంటూ శ్రేయాస్ గ్రూప్ ట్వీట్ చేసింది. ప్రస్తుతం బాలయ్య బోయపాటి శ్రీను దర్శకత్వంలో సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. సినిమా టైటిల్ కూడా మోనార్క్ అని పెట్టినట్టు సమాచారం.
ఇకపోతే ఈ సినిమాలో బాలయ్య ఓ సాంగ్ పాడాడట. ఆ సాంగ్ లో సింహా కూడా గొంతుకలిపారని సమాచారం. బాలయ్య పుట్టినరోజు నాడు జూన్ 10 న ఆ పాటను విడుదల చేయనున్నారట.