నందమూరి బాలకృష్ణ ఇటీవలే అఖండ సినిమాతో సూపర్ డూపర్ హిట్ ని అందుకున్నాడు. అయితే దీంతో పాటు అన్ స్టాపబుల్ విత్ ఎన్.బి.కె అంటూ ఓ టాక్ షో కూడా చేశాడు. ఎవరూ ఊహించని విధంగా ప్రేక్షకుల నుంచి ఈ టాక్ షో కు మంచి రెస్పాన్స్ వచ్చింది. కాగా ఈ సీజన్ ఫైనల్ ఎపిసోడ్ గా సూపర్ స్టార్ మహేష్ బాబు ఎపిసోడ్ ప్రచారం చేశారు మేకర్స్.
ఆ ఎపిసోడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు పై నందమూరి బాలకృష్ణ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు వైరల్ గా మారాయి. నువ్వు కేవలం నటుడు కాదు ఒక తరాన్ని ముందుకు తీసుకెళ్లే మార్గదర్శివి అంటూ చెప్పుకొచ్చారు.
బాలయ్య చేసిన ఈ వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇక మహేష్ వేలాది మంది చిన్నారులకు గుండె ఆపరేషన్లు చేయించగా ఈ విషయంపై కూడా బాలయ్య మహేష్ ను ప్రశంసించారు.
ఇక సినిమాల విషయానికొస్తే మహేష్ బాబు ప్రస్తుతం సర్కారు వారి పాట, ఎస్ఎస్ఎంబి 28 సినిమాలు చేస్తున్నాడు. అలాగే నందమూరి బాలకృష్ణ గోపిచంద్ మలినేని దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా తర్వాత అనిల్ రావిపూడి, బోయపాటితో ఓ సినిమా చేయనున్నాడు.