సాధారణంగా తెలుగు రాష్ట్రాల్లో పెద్ద హీరోల సినిమాలు రిలీజ్ అయిన ప్రతిసారీ థియేటర్లలో హంగామా నడుస్తూ ఉంటుంది. అభిమానులు కటౌట్‌లు ఏర్పాటు చేస్తారు, పాలాభిషేకాలు చేస్తారు, పోస్టర్ల ముందు కొబ్బరికాయలు కొడతారు. ఇలా రకరకాలుగా వారి అభిమాన హీరోపై ప్రేమను వ్యక్త పరుస్తూ ఉంటారు. కానీ పాశ్చాత్య దేశాల్లో అలా ఉండదు. అక్కడ తెలుగు, తమిళం సినిమా వచ్చినా థియేటర్లలో ఇంత హంగామా కనిపించదు. కానీ కాలిఫోర్నియాలోని సెర్రా థియేటర్స్ లో మాత్రం నందమూరి బాలకృష్ణ అభిమానులు నానా హంగామా సృష్టించారు.
బాలయ్య పోస్టర్ ముందు కేక్ కట్ చేశారు, కొబ్బరికాయలు కొట్టారు. అందుకు సంబంధించిన ఫోటోలు ఇప్పుడు సోషల్ మీడియా లో వైరల్ అవుతున్నాయి. ఇక బోయపాటి శ్రీను దర్శకత్వం వహించిన అఖండ చిత్రంలో ప్రగ్యా జైస్వాల్, శ్రీకాంత్, జగపతి బాబులు ప్రధాన పాత్రల్లో నటించారు. గురువారం విడుదలైన ఈ చిత్రం పాజిటివ్ టాక్‌ను తెచ్చుకుంది.