ఇండస్ట్రీ లో హీరోల మధ్య పోటీ ఉంటుంది. అయితే అది సినిమాల వరకూ మాత్రమే. బయట అందరు హీరోలు మంచి రిలేషన్స్ ని కలిగి ఉంటారు. ఎంతలా అంటే కలసి భోజనం చేయడం ఏదైనా ప్రదేశాలకు వెళ్లడం చేస్తూ ఉంటారు. ఇక అప్పట్లో నందమూరి బాలకృష్ణ మెగాస్టార్ చిరంజీవి ల మధ్య పోటీ తారా స్థాయిలో ఉండేది. నువ్వా నేనా అన్నట్టు వీరి సినిమాలు రిలీజ్ అయ్యేవి. అయితే అప్పట్లో 1990లో కోదండరామిరెడ్డి దర్శకత్వంలో బాలకృష్ణ యువచిత్ర ఆర్ట్స్ బ్యానర్ లో నారీ నారీ నడుమ మురారి సినిమా చేశారు. ఇందులో శోభన నిరోషా హీరోయిన్స్ గా నటించారు.
ఊర్వశి శారద, కైకాల సత్యనారాయణ, అల్లు రామలింగయ్య రమా ప్రభ తనికెళ్ల భరణి తదితరులు కీలక పాత్రల్లో నటించారు. ఈ సినిమాకు కీరవాణి తండ్రి శివశక్తి దత్త అలాగే రాజమౌళి తండ్రి విజయేంద్ర ప్రసాద్ రచయితగా పనిచేశారు. అప్పటికే యాక్షన్ చిత్రాలతో మంచి గుర్తింపు తెచ్చుకున్న బాలయ్య ఈ చిత్రంతో ఫ్యామిలీ ఆడియన్స్ కు కూడా మెప్పించగలనని నిరూపించుకున్నాడు.
ఇలా అయితే ఎలా బంగార్రాజు? 49 తప్పులా!!
ఇద్దరి మధ్య ముద్దుల బావ గా బాలయ్య నటన అద్భుతంగా ఈ సినిమాలో ఉంటుంది. కె వి మహదేవన్ సంగీతం ముఖ్యంగా ఇరువురి భామల కౌగిలిలో అనే పాట సంచలనం సృష్టించింది. అయితే ఈ సినిమాకు సంబంధించి చాలా మందికి తెలియని విషయం ఏంటంటే ఈ సినిమాలో కొన్ని సన్నివేశాలను మెగాస్టార్ చిరంజీవి ఇంట్లో చిత్రీకరించారట.
ఒకప్పటి హీరోయిన్….అవకాశాలు లేక సబ్బులు అమ్ముతుంది
తమిళనాడులోని వెలచ్చేరి ప్రార్ధనలో చిరంజీవికి హనీ హౌస్ అనే గెస్ట్ హౌస్ ఉంది. దీనికి పక్కన రెండు ఎకరాల స్థలం కూడా ఉంది. ఈ చిత్రంలో బాలకృష్ణ ఒక పూరిగుడిసె లో ఉంటాడు. ఆ పూరి గుడిసె కూడా చిరంజీవి కి చెందిన స్థలంలోనే నిర్మించారట. సినిమాకు సంబంధించిన చాలా సన్నివేశాలను కూడా చిరంజీవి గెస్ట్ హౌస్ లో షూట్ చేశారట.