నందమూరి బాలకృష్ణ గురించి తెలుగు ప్రజలకు ప్రత్యేకంగా పరిచయం చేయనవసరం లేదు. ఇక అభిమానుల పై మీటింగ్ లలో చేయి చేసుకోవడం, తిట్టటం వంటివి ఎప్పటికప్పుడు చేస్తూ ఉంటాడు బాలయ్య. అలా చేసిన ప్రతిసారి వార్తల్లో నిలుస్తూ ఉంటాడు. ఇక ఇప్పుడు తాజాగా మరోసారి వార్తల్లో నిలిచారు బాలయ్య. ఎన్టీఆర్ 26వ వర్ధంతి సందర్భంగా ఎన్టీఆర్ ఘాట్ వద్ద నివాళులు అర్పించారు బాలయ్య. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ ఓ రిపోర్టర్ పై ఆగ్రహం వ్యక్తం చేశారు.
కరోనా విజృంభిస్తోంది.. ప్రతి ఒక్కరు వ్యక్తిగత దూరం పాటించాలి అంటూ బాలయ్య చెప్తున్న సమయంలో ఓ రిపోర్టర్ సార్ అది వ్యక్తిగత కాదు సామాజిక అని అన్నాడు. ఆ సమయంలో బాలయ్య వెంటనేఅది సామాజిక కాదు గాడిద వ్యక్తిగత.. సామజిక ఏంటి అంటూ ఫైర్ అయ్యారు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్ గా మారింది.
ఇక సినిమాల విషయానికొస్తే బాలయ్య ఇటీవలే అఖండ సినిమా తో సూపర్ డూపర్ హిట్ ని అందుకున్నాడు. ప్రస్తుతం గోపీచంద్ మలినేని తో ఓ సినిమా చేస్తున్నాడు.