నందమూరి బాలకృష్ణ 73వ గణతంత్ర దినోత్సవ వేడుక సందర్భంగా హైదరాబాద్ లోని బసవ తారకం ఇండో అమెరికన్ క్యాన్సర్ ఆస్పత్రిలో జెండా ఎగురవేశారు. ఈ సందర్భంగా బాలకృష్ణ తన తల్లిదండ్రులు ఎన్టీఆర్, బసవతారకం చిత్రపటాలకు నివాళులర్పించారు. దేశ ప్రజలందరికీ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు.
కొత్త నెంబర్ బాలకృష్ణ ఇటీవలే అఖండ సినిమాతో మంచి అందుకున్నాడు బోయపాటి శ్రీను దర్శత్వంలో వచ్చిన ఈ సినిమాలో ప్రగ్యా జైస్వాల్ హీరోయిన్ గా నటించింది. అలాగే పూర్ణ జగపతిబాబు కీలక పాత్రలో నటించారు. శ్రీకాంత్ విలన్ గా నటించారు.
ఇక ప్రస్తుతం గోపీచంద్ మలినేని దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాలో శృతహాసన్ హీరోయిన్ గా నటిస్తుంది. వరలక్ష్మీ శరత్ కుమార్, దునియా విజయ్ కుమార్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు.
మరోవైపు అన్ స్టాపబుల్ విత్ ఎన్.బి.కే టాక్ షో ఫస్ట్ సీజన్ ను కంప్లీట్ చేశాడు. త్వరలోనే సెకండ్ సీజన్ ను స్టార్ట్ చేయబోతున్నాడు.