నందమూరి బాలకృష్ణ అఖండ చిత్రం తో బ్లాక్ బస్టర్ హిట్ ను అందుకున్నాడు. ప్రస్తుతం గోపీచంద్ మలినేని దర్శకత్వంలో ఓ సినిమా చేయబోతున్నాడు బాలయ్య. ఇటీవలే ఈ సినిమాకు సంబంధించిన పూజా కార్యక్రమాలు కూడా జరిగాయి.
కాగా తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం ఫిబ్రవరి 12 నుంచి ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ స్టార్ట్ కాబోతుందట. ఈ సినిమాలో శృతి హసన్ హీరోయిన్ గా నటిస్తుండగా వరలక్ష్మి శరత్ కుమార్, దునియా విజయ్ కీలక పాత్రలో నటిస్తున్నారు.
మైత్రి మూవీ మేకర్స్ వారు భారీ బడ్జెట్ తో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. వాస్తవ సంఘటనల ఆధారంగా తెరకెక్కుతున్న ఈ సినిమాకి ఎస్ఎస్ థమన్ సంగీతం అందిస్తున్నాడు.
ఈ సినిమా తర్వాత అనిల్ రావిపూడి తో సినిమా చేయబోతున్నాడు బాలయ్య. మరి చూడాలి బాలయ్య గోపీచంద్ సినిమాతో ఎలాంటి హిట్ ను అందుకుంటాడో చూడాలి.