నందమూరి బాలకృష్ణ నటిస్తున్న లేటెస్ట్ సినిమా ‘రూలర్’. జై సింహా కాంబినేషన్ ని రిపీట్ చేస్తూ కెఎస్. రవికుమార్ తెరకెక్కిస్తున్న ఈ సినిమాని సి.కల్యాణ్ ప్రొడ్యూస్ చేస్తున్నాడు. బాలయ్య రెండు వేరియేషన్స్ ఉన్న పాత్రల్లో నటిస్తున్నాడు. ఇందులో ఒకటి పోలీస్ కాగా, మరొకటి బిజినెస్ మెన్… ఈ పాత్రలకి సంబంధించిన లుక్స్ ఇప్పటికే విడుదలై నందమూరి అభిమానులని అలరిస్తున్నాయి. నిన్న కొత్త పోస్టర్ తో రిలీజ్ డేట్ అనౌన్స్ చేసిన చిత్ర యూనిట్, త్వరలోనే టీజర్ ని కూడా రిలీజ్ చేయనున్నట్లు హింట్ ఇచ్చారు.
ప్రస్తుతం రూలర్ షూటింగ్ మున్నార్‌లో జరుగుతోంది. బాలకృష్ణ, వేదిక లపై షూట్ చేస్తున్న ఈ సాంగ్ కి ప్రేమ్ రక్షిత్ కొరియోగ్రఫీ చేస్తున్నాడు. రామజోగయ్య శాస్త్రి రాసిన ఈ సాంగ్ చాలా ఎనర్జిటిక్ గా ఉంటుందని, బాలయ్య వేసే స్టెప్స్ యంగ్ బాలకృష్ణని గుర్తు చేస్తాయని సమాచారం. వేదికతో పాటు లెజెండ్ సినిమాలో నటించిన సోనాల్ చౌహాన్ కూడా రూలర్ లో హీరోయిన్ గా నటిస్తోంది. చిత్రంజన్ భట్ మ్యూజిక్ అందిస్తున్న ఈ సినిమాలో ప్రకాష్‌రాజ్, జయసుధ, భూమిక ఇతర పాత్రల్లో కనిపించనున్నారు.